ఓ వృద్ధురాలి తలకు ప్రమాదవశాత్తు గాయమయింది. దాంతో కుటుంబ సభ్యులు ఆమెనే ఆసుపత్రికి తరలించారు.. అక్కడి సిబ్బంది ఆమె గాయానికి కట్టుకట్టారు. అయినప్పటికీ రక్తస్రావం ఆగకపోవడంతో ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన అక్కడి వైద్యులు కుట్లు వేసేందుకు కట్టు విప్పారు. గాయంపై కనిపించిన కండోమ్ ప్యాక్ చూసి ఆశ్చర్యపోయారు.
విషయం వెలుగులోకి వచ్చి విమర్శలు వెల్లువెత్తడంతో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా స్పందించారు. బాధిత మహిళ రేష్మాబాయ్ ఆసుపత్రికి వచ్చిన సమయంలో డాక్టర్ ధర్మేంద్ర రాజ్‌పుత్, వార్డ్‌బాయ్ ఎమర్జెన్సీ విధుల్లో ఉన్నట్టు చెప్పారు. పోర్సా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డ్రెస్సర్‌ను సస్పెండ్ చేసినట్టు చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు పేర్కొన్నారు.ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని మురేనా జిల్లాలో జరిగింది.
వృద్ధురాలి తలకు గాయం- కండోమ్ ప్యాక్ తో కట్టుకట్టిన డాక్టర్
Advertisement
తాజా వార్తలు
Advertisement