ఉత్తరప్రదేశ్ లో చివరిదశ పోలింగ్ కొనసాగుతోన్న వేళ ఓ సంఘటన చోటు చేసుకుంది. ఓటు వేయడానికి వచ్చిన ఓ వృద్ధుడు తన భార్యని రిక్షాలో తీసుకురావడం అందరి దృష్టినీ ఆకర్షించింది. అజంగఢ్ లోని ఓ పోలింగ్ కేంద్రానికి స్వయంగా రిక్షాను తోసుకుంటూ ఆయన వచ్చాడు. తన భార్య అంగవైకల్యంతో బాధపడుతోందని, తనకు కూడా వెన్నెముక సమస్య ఉందని ఆయన చెప్పాడు. అయినా తన భార్యను రిక్షాలో కూర్చోబెట్టి తీసుకొచ్చానని తెలిపాడు. ప్రభుత్వం ఇస్తోన్న రూ.500-రూ.1,000 పెన్షను సరిపోవట్లేవని ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా యూపీలో 54 నియోజకవర్గాల్లో జరుగుతోన్న ఈ ఎన్నికల్లో 613 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement