తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. జూలై నెలాఖరు వరకు ఏకాంతంగానే ఆర్జిత సేవలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. కాగా, కరోనా కేసులు తగ్గిపోవడంతో ఏప్రిల్ 1న శ్రీవారి ఆర్జిత సేవలను టీటీడీ పునరుద్ధరించింది. అదేవిధంగా సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం టికెట్ల సంఖ్యను పెంచింది. దీంతో వేంకటేశ్వరుని దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 23 కంపార్ట్ మెంట్లలో వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. కాగా, శనివారం శ్రీవారిని 76,324 మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారని వెల్లడించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement