ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్న వేళ.. కేంద్రం 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియమించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి ప్రాధాన్యం ఇచ్చింది. ఈ ఎనిమిది మందిలో నలుగురు కొత్త వారు కాగా, మిగిలిన నలుగురు బదిలీ అయ్యారు. గవర్నర్ బండారు దత్తాత్రేయకు స్థాన చలనం కలుగగా, ఏపీ బీజేపీ నేత కంభంపాటి హరిబాబును గవర్నర్ పదవి వరించింది. గవర్నర్ మిజోరాం గవర్నర్‌గా ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబును నియమించింది. హరియాణా గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ, కర్ణాటక గవర్నర్‌గా థావర్‌చంద్ గెహ్లోత్, మధ్యప్రదేశ్ గవర్నర్‌గా మంగూబాయి ఛగన్‌భాయ్ పటేల్, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్, గోవా గవర్నర్ గా పాస్ శ్రీధరం పిళ్ళై, త్రిపురకు సత్యదేవ్ నారాయణ్ ఆర్య, జార్ఖండ్ కు రమేష్ బైస్ ను గవర్నర్లుగా కేంద్రం నియమించింది.
కాగా, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా కొనసాగుతున్న బండారు దత్తాత్రేయను హర్యానాకు బదిలీ అయ్యారు. మిజోరం గవర్నర్‌గా కొనసాగుతున్న పీఎస్ శ్రీధరన్ పిళ్లై గోవా గవర్నర్‌గా, హర్యానా గవర్నర్‌గా కొనసాగుతున్న సత్యదేవ్ నారాయణ్ త్రిపుర గవర్నర్‌గా, త్రిపుర గవర్నర్‌గా కొనసాగుతున్న రమేశ్ బైస్ జార్ఖండ్ గవర్నర్‌గా నియామకం అయ్యారు.
ఇది కూడా చదవండి: హరీష్ రావు ఇలాకాలో టెన్షన్.. మహిళ ఆత్మహత్యాయత్నం