కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 10 రోజుల పాటు లాక్‌డౌన్ విధించింది. నేటి నుంచి ఈ నెల 22 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ను అమలు చేస్తారు. ఈ నేపథ్యంలో పది రోజుల పాటు వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం లాక్ డౌన్ సమయంలో క్రయ, విక్రయదారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేరుకోవడం ఇబ్బంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 75మందికి పైగా తహసీల్దారులు, డీటీలు, ఆర్ఐలు, వీఆర్వోలు, వీఆర్ఏలు మరణించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
రిజిస్ట్రేషన్ల బంద్‌కు సంబంధించిన కొత్త గైడ్ లైన్స్‌ను ప్రభుత్వం విడుదల చేయనుందని సమచారం. అయితే ఇప్పటికే స్లాట్లను బుక్ చేసుకున్న వారికి ఎలా అవకాశం కల్పించాలనే దానిపై కూడా ప్రభుత్వం ఈ కొత్త గైడ్ లైన్స్‌లో పేర్కొంటుందని తెలుస్తోంది. అటు కరోనా ప్రభావం తగ్గే వరకు ప్రతిరోజు అమలు చేస్తున్న 30 స్లాట్ల సంఖ్యను కుదిరించాలని తెలంగాణ రెవిన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.