Tuesday, November 26, 2024

తెలంగాణను నేర రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి.. మహేందర్ రెడ్డి

తెలంగాణను నేర రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ గోషామహల్‌ స్టేడియంలో జరిగిన పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌ రెడ్డి హాజరయ్యారు. అమరులైన పోలీసులకు నివాళులర్పించారు. అనంతరం డీజీపీ మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్‌ శాఖ సమర్ధవంతంగా పనిచేస్తున్నదని అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగంలో దేశంలోనే ముందంజలో ఉన్నామని చెప్పారు.

పౌరుల భద్రతే లక్ష్యంగా పోలీసు శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. ఒకే రాష్ట్రం, ఒకే సేవ అనే సూత్రంతో స్నేహపూర్వక సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. జవాబుదారీతనం, పారదర్శకత, బాధ్యతాయుత పోలీసు సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో 15 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. నేరం చేస్తే శిక్ష నుంచి తప్పించుకోలేని విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement