(ప్రభన్యూస్) : దేశవ్యాప్తంగా చరిత్రాత్మక గరిష్ఠ స్థాయికి చేరిన ఇంధన ధరలు కొత్త మార్పులకు బాటలు వేస్తున్నాయి. దేశంలో ఎలక్ట్రిక్ మోడల్ ద్విచక్ర వాహన వినియోగానికి జనాలు మొగ్గు చూపుతున్నారు. ఇటివల ఎలక్ట్రిక్ వాహన విక్రయాలు పెరుగుతుండడం ఇందుకు చక్కటి సంకేతం. ప్రస్తుతం ఒక లీటర్ పెట్రోల్ దాదాపు రూ.100 ఉందను కుంటే బైక్ దాదాపు 100 కి.మీ దూరం ప్రయాణి స్తుంది. అయితే పెట్రోల్ ఖర్చులో కేవలం 6వ వంతు వ్యయంతో ఎలక్ట్రిక్ స్కూటర్ దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణిం చగలదు. ఈ సానుకూల పరిణామంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కొనుగోలుకు జనాలు మొగ్గుచూపుతున్నారు. దేశీయంగా పెట్రోల్ వినియోగంలో 70 శాతం మేర ద్విచక్ర వాహనాల వాటా ఉంది.
హీరో ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రైవేటు, ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీప్రైవేట్ ఇప్పటికే రూ.70 వేల రేంజ్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకొ చ్చాయి. పెట్రోల్‌తో నడిచే స్కూటర్లు, బైక్‌లు కూడా దాదాపు ఇదే స్థాయి ధరలలో లభిస్తుండడం మరో సానుకూలంగా ఉంది. ఇంధన వినియోగంలో అత్యంత కీలకమైన ద్విచక్ర వాహన దారులు ఎలక్ట్రిక్ మోడళ్ల వైపు మొగ్గుచూపుతుం డడం కీలక పరిణామం. 2070 నాటికి దేశాన్ని సున్నా కర్భన ఉద్గార దేశంగా రూపాంతరం చెందాలనే లక్ష్యాన్ని నిర్దేశించు కున్న తరుణంలో ఈ సంకేతం ఎంతో ప్రోత్సాహ కరమైనదని నిపుణులు చెబుతున్నారు.
ప్రజా రవాణా అందుబాటులో ఉండే భారత్‌లో వాహన విక్రయాల్లో దాదాపు 80 శాతం ద్విచక్ర వాహనాలే. కార్ల విక్రయాలు కూడా గణనీయంగా పెరిగాయి. కాబట్టి భారత్‌లో ఎలక్ట్రిక్ రంగానికి చక్కటి అవకాశాలు ఉంటాయని బ్లూమ్‌బర్గ్ ఎన్‌ఈఎఫ్ అంచనా వేసింది. 2040 నాటికి దేశంలో వాహన విక్రయాల్లో ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు, స్కూటర్ల అమ్మకాలు 74 శాతం వరకు ఉంటాయని పేర్కొంది. ప్రస్తుతం 1 శాతాని కంటే తక్కువగానే ఉన్నా భారీగా కొనుగోళ్లు పెరుగుతాయని వెల్లడించింది. ద్విచక్ర వాహన దారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతారనేది కాదనిలేని వాస్తవ మని ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీస ర్ వరుణ్ దూబే విశ్వాసం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలను ఎంచుకుకోకుం డా ఉండేందుకు వేరే కారణ మేమీ ఉండబోద న్నారు. ప్రస్తుతానికైతే దేశవ్యాప్తం గా ఛార్జింగ్ మౌలిక సదుపా యాలు లేమి వంటి అవరోధాలు ఉన్నాయని చెప్పారు.
అయితే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూ.15 వేల సబ్సిడీతో వినియోగదారులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు లభిస్తున్నాయి. చైనా వంటి కొన్ని దేశాల్లో సైకిల్ లేన్లలో ఈ-స్కూటర్లను నడిపేందుకు అనుమతులు ఉన్నాయని గుర్తు చేశారు. భారత్ కర్భన ఉద్గార లక్ష్యాన్ని చేరుకోవాలంటే ట్రిలియన్ల డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయి. అయితే భారీ స్థాయి నిధులను ఏవిధంగా సమీకరిస్తారనే విషయాన్ని మోడీ ప్రభుత్వం వెల్లడించలేదు. మరోవైపు కర్భత ఉద్గార రహిత ప్రపంచం కోసం ధనిక దేశాలు తమ పాత్రను మరిం త పెంచాల్సి ఉంది. కాగా కాప్ 26 సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ.. దేశాన్ని 2070 నాటికి సున్నా కర్భన ఉద్గార లక్ష్యా న్ని భారత్ ఎంచుకుందని ప్రకటించిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily