Friday, November 22, 2024

Breaking: ఈటల హౌస్ అరెస్ట్.. పోలీసుల తీరుపై ఆగ్ర‌హం

నిన్న జనగామలో రెండు పార్టీల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగాయి. ఈ దాడిలో గాయపడిన బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను పరామర్శించడానికి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ వెళ్తుండ‌గా.. వీలు లేదని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై ఈట‌ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు ఉండాలి.. కానీ, ధర్నాలు చేయడానికి, నిరసనలు చెప్పడానికి టీఆర్ఎస్ పార్టీ వారికి మాత్రమే అనుమతులు ఉంటాయా? దాడులు జరిగితే పోలీసులు వారి పక్షాన నిలుస్తారా ? ఇది ఎక్కువ కాలం చెల్లదు. అని ఈట‌ల మండిప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement