Sunday, November 24, 2024

Editorial – ఖ‌లిస్తాన్ కు కెన‌డా ఊపిరి…

ఖలిస్తాన్‌ అంటే పుణ్యభూమి అని అర్థం. పాకి స్తాన్‌ అన్నా పుణ్యభూమే. ఇవే పుణ్యభూములైతే, భారత్‌ ఎంత పుణ్యభూమో వేరే చెప్పనవసరం లేదు. నిజానికి శాంతి, సత్యం, అహింసలను యావత్‌ ప్రపంచానికీ అందించిన భారత్‌ మాత్రమే పుణ్యభూమి. దేశ విభజన సమయంలో విడిపోయిన పాకిస్తాన్‌ అరాచక శక్తులకు ఆలవాలమై ఉగ్రవాదులకు పుట్టినిల్లు అయింది. పంజా బ్‌ని మరో పాకిస్తాన్‌గా తయారు చేద్దామని అక్కడి తీవ్రవాదులు 80వ దశకం ఆరంభంలో ప్రారంభించిన యత్నాలు ఖలిస్తాన్‌ ఆవిర్భావానికి దారితీశాయి. వేర్పాటు ఉద్యమాలన్నింటికీ మూలం ప్రజల్లో ఉన్న అసంతృప్తి. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ ఆవిర్భావం గురించి మనందరికీ తెలుసు. ఖలిస్తాన్‌ నిరసనగళాలకు పంజాబీల్లో పేరుకున్న అసంతృప్తి కారణమన్న భావం ఉంది గానీ, దాన్ని భారత్‌లోని పంజాబీలందరికీ అదే అభిప్రాయం ఉందని అనడం వక్రీకరణ. నదీజలాల పంపి ణీలోనూ, ఉమ్మడి రాజధానిగా చండీగఢ్‌ని కొనసా గించడంలోనూ పంజాబీల్లో చాలాకాలంగా రగులుతు న్న అసంతృప్తిని ఆధారంగా చేసుకుని బింద్రన్‌వాలే అనే వ్యక్తి సిక్కు యువకులను చేరదీసి ఖలిస్తాన్‌ ఉద్యమాన్ని ప్రారంభించారు.

అప్పట్లో కాంగ్రెస్‌లోని అసంతృప్తి పరు ల్లో కొందరు ప్రత్యక్షంగానూ, మరికొందరు పరోక్షంగాను మద్దతు గా నిలిచారు. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ.. ఆనాటి ముఖ్యమంత్రి జైల్‌సింగ్‌ ద్వారా ఈ ఉద్యమానికి ఊపిరి పోశారని ఆమె ప్రత్యర్థులు అప్పట్లో ఆరోపించారు. ఖలిస్తాన్‌ ఉద్యమ ప్రభావితులైన తన అంగరక్షకుల చేతిలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. దానిని బట్టి అది నిజంకాదని ఆనాడే తేలిపోయింది. అయితే, ఇంతకాలానికి ఖలిస్తాన్‌ ఉద్యమానికి భారత్‌ తోడ్పాటునం దించిందనీ, ఇప్పటికీ భారత్‌ సాయం అందిస్తోందంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో వ్యాఖ్యానించడంలో అణుమాత్రమైనా సత్యం లేదని రుజువు అవుతోంది. ఇందిరాగాంధీ విశ్వాసపాత్రుడైన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పంజాబ్‌లో వేర్పాటు ఉద్యమాన్ని తరిమేశారు. ఖలిస్తానీయుల ఆట కట్టించా రు. అయితే, వారు కెనడాలో ఆశ్రయం పొంది అక్కడ వ్యాపార రంగంలో మేటిగా ఎదిగారు. తద్వారా రాజకీ యాల్లో కూడా ప్రవేశించి ఉన్నత స్థాయిలో పదవులను పొందుతున్నారు. కెనడా నుంచి ఆస్ట్రేలియా, తదితర దేశాల్లో ఖలిస్తాన్‌ శాఖలను ప్రారంభించి భారీ ఎత్తున నిధులను సేకరిస్తున్నారు.

పంజాబ్‌లో ప్రకాష్‌సింగ్‌ బాదల్‌ నేతృత్వంలోని అకాలీదళ్‌ అధికారంలో ఉన్నప్పుడు ఖలిస్తానీయులు ఆయుధాల రూపంలో కాకుండా మాదక ద్రవ్యాల తరలింపు ద్వారా తమ పట్టును కొనసాగిస్తూ వచ్చారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఖలిస్తాన్‌ ఉద్యమాన్ని అదుపు చేయడానికి ప్రయత్నించింది. అయితే, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అలనాటి పీవీ ప్రభుత్వంతో పోలిస్తే తీసుకున్న చర్యలు తక్కువే. మొత్తం మీద ఖలిస్తాన్‌ ఉద్యమం కనుమరుగైనట్టు కనిపిస్తున్నా, చాటుమాటుగా, ఆ ఉద్యమకారులు ఏర్పరుచుకున్న మాదక ద్రవ్యాల నెట్‌వర్క్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. అటు కెనడాలో మాత్రం ఖలిస్తాన్‌ ఉద్యమకారులు ప్రభుత్వంలోని పదవులను నిర్వహిస్తూ ఇతర దేశాల్లో శాఖలను ఏర్పరుచుకుంటున్నారు. ఆయా దేశాల్లో ఖలిస్తాన్‌ ఉద్యమకారులను ఓటు బ్యాంకుగా ఉపయోగించు కుంటున్నారు. కెనడాలో జస్టిన్‌ ట్రూడో పార్టీకి నిధులనూ, ఓట్లను అందిస్తున్నది ఖలిస్తాన్‌ తీవ్రవాదులే. అక్కడి ప్రభుత్వాన్ని పరోక్షంగా నడిపిస్తున్నదీ వారే. ఖలిస్తాన్‌ వేర్పాటువాదం భారతదేశంలో ముఖ్యంగా పంజాబ్‌లో ఎక్కడా లేదు. నదీ జలాల పంపిణీ విషయంలో యూపీఏ ప్రభుత్వం పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌ల మధ్య రాజీ కుదిర్చింది

. ప్రస్తుత నరేంద్రమోడీ ప్రభుత్వం కూడా నీటి వాటాల్లో అసంతృప్తిని తొలగించేందుకు కృషి చేస్తోంది. అందువల్ల పంజాబ్‌లో ఖలిస్తాన్‌ తీవ్రవాదులకు రాజకీయంగా ఆదరణ లభించడం గగనమవుతోంది. అయితే, మాదక ద్రవ్యాల నెట్‌వర్క్‌ కొనసాగుతూ ఉండటం వల్ల ఖలిస్తానీయులు తిరిగి పంజాబ్‌లో తిష్ట వేయడానికి ప్రయత్నిస్తున్న మాట నిజమే. కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం వేర్పాటువాదాన్ని కూకటి వేళ్ళతో పెకలించేందుకు చర్యలు తీసుకుంటున్న దృష్ట్యా ఖలిస్తానీయుల ఆటలు సాగవని చెప్పవచ్చు. ఈ విషయమై ప్రధాని మోడీ ఇటీవల షాంఘై సహకార సంస్థ సమావేశంలో పాకిస్తాన్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ సమక్షంలో కుండబద్దలు కొట్టినట్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement