Tuesday, November 26, 2024

బోగ్గు స్కాం కేసు.. టీఎంసీ లీడర్ అభిషేక్ బెనర్జీ, అతని భార్యకు ఈడీ సమన్లు..

బొగ్గు అక్రమ రవాణా కేసులో నిందితులకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజీరాలకు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం సమన్లు జారీ చేసింది. బెనర్జీ, అతని భార్య వచ్చే వారం రెండు వేర్వేరు తేదీలలో ఢిల్లీలోని ఏజెన్సీ ముందు విచారణకు హాజరు కావాలని కోరినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఎలాంటి రిలీఫ్ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, అతని భార్యకు సమన్లు జారీ అయ్యాయి. TMC జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన బెనర్జీని గత ఏడాది సెప్టెంబర్ 6న దాదాపు ఎనిమిది గంటలకు పైగా ఈడీ ప్రశ్నించింది.

అభిషేక్ బెనర్జీని ముందుగా ప్రశ్నించినప్పుడు ఆర్థిక దర్యాప్తు సంస్థకు సహకరించలేదు. బెనర్జీని అతని కుటుంబానికి సంబంధించిన రెండు సంస్థలు అందుకున్న లెక్కల్లో చూపని డబ్బు గురించి ప్రత్యేకంగా అడిగారు.
బొగ్గు స్మగ్లింగ్ కేసులో వచ్చిన నేరాల ద్వారా వచ్చిన ఆదాయమని అధికారులు పేర్కొన్న డబ్బు మూలాన్ని వివరించడంలో అతను విఫలమయ్యాడని EDకి సన్నిహిత వర్గాలు తెలిపాయి. అతని భార్య రుజీరాకు కూడా ED సమన్లు పంపింది. అయితే ఆమె విచారణకు రావడానికి నిరాకరించింది. ఆ తర్వాత, దర్యాప్తు సంస్థ జారీ చేసిన సమన్లకు వ్యతిరేకంగా ఇద్దరూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

మనీ లాండరింగ్ కేసు
రెండు కంపెనీలు – లీప్స్ అండ్ బౌండ్ PVT LTD , లీప్స్ అండ్ బౌండ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ LLP – అభిషేక్ బెనర్జీ, అతని కుటుంబంతో అనుసంధానించి ఉన్నాయని ED పేర్కొంది. ఈ సంస్థలు బొగ్గు అక్రమ రవాణా కేసులో విచారణ జరుపుతున్న నిందితుల ద్వారా నిర్మాణ సంస్థ నుంచి రూ.4.37 కోట్ల ఫండ్స్ని పొందినట్లు ఈడీ పేర్కొంది. అభిషేక్ బెనర్జీ తండ్రి, అమిత్ బెనర్జీ, లీప్స్ అండ్ బౌండ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లలో ఒకరు. అతని భార్య రుజీరా బెనర్జీ అతని తండ్రితో పాటు లీప్ అండ్ బౌండ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ లిమిటెడ్‌కి డైరెక్టర్ గా ఉన్నారు. ఈ రెండు కంపెనీలు స్థానిక స్థాయి సిండికేట్ సమస్యలను నివారించడానికి ప్రయత్నిస్తున్న వ్యాపార యజమానుల నుండి నిధులు పొందుతున్నాయని అధికారులు తెలిపారు.

ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడిగా టీఎంసీ యువనేత వినయ్ మిశ్రాతో అభిషేక్ బెనర్జీకి ఉన్న అనుబంధం గురించి కూడా ప్రశ్నించారు. ED తెలిపిన వివరాల ప్రకారం.. బొగ్గు స్మగ్లింగ్ ద్వారా వచ్చిన నగదును తరలించడంలో వినయ్ మిశ్రా ముఖ్యమైన పాత్ర పోషించాడు. అయితే, అభిషేక్ బెనర్జీ ఆరోపించిన నేరం గురించి లేదా వినయ్ మిశ్రాతో తనకున్న అనుబంధం గురించి తనకు తెలియదన్నట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తు అధికారులు అతని సమాధానాలతో సంతృప్తి చెందలేదు. దీంతో టీఎంసీ ఎంపీని మళ్లీ విచారణకు పిలిచే అవకాశం ఉందని వారు తెలిపారు.

బొగ్గు స్కామ్‌తో లింక్‌లు ఆరోపణలు
ఈ కేసులో ప్రధాన నిందితుడు అనుప్ మాఝీ, పోలీస్ ఇన్‌స్పెక్టర్ అశోక మిశ్రా గురించి కూడా అభిషేక్ బెనర్జీని ED ప్రశ్నించింది. అయితే అభిషేక్ బెనర్జీ తమకు ఎలాంటి సంబంధాలు లేవని ఖండించారు. మార్చి 2020 నుండి, అశోక్ మిశ్రాకు డబ్బు డెలివరీ చేయాల్సిందిగా కేసులోని సాక్షిని అనుప్ మాఝీ ఆదేశించినట్లు ED పేర్కొంది.

- Advertisement -

మార్చి 2020 నుండి ప్రతిరోజూ పెద్ద మొత్తంలో డబ్బు డబ్బాలలో ప్యాక్ చేసి రవాణా చేయబడిందని ED ఆరోపించింది. ఈ డబ్బాలు బంకురా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అశోక్ కుమార్ మిశ్రాకు డెలివరీ చేయబడ్డాయి, తరువాత వారు కొంతమంది ఉన్నత స్థాయి రాజకీయ నాయకులకు డబ్బును తరలించారని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement