పత్రాచల్ భూకుంభకోణం కేసులో ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఈ కేసులో శివసేన సీనియర్ నేత..ఎంపీ సంజయ్ రౌత్ ని ఈడీ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు సంజయ్ రౌత్ ఇంటిలో ఆదివారం ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు .కాగా రౌత్ మద్దతుదారులు ఆయన నివాసం వెలుపల గుమిగూడారు. ఈడీ, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తనపై ఈడీ చర్యల నేపథ్యంలో తాను శివసేనను విడిచిపెట్టబోనని, పోరాడుతూనే ఉంటానని రౌత్ ట్వీట్ చేశారు. సంజయ్ రౌత్‌కు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఈడీ ఏప్రిల్‌లో రౌత్ భార్య వర్షా రౌత్, ఆయన సహచరులకు చెందిన సుమారు రూ. 11.15 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే. పత్రాచల్ భూ కుంభకోణంలో (మనీలాండరింగ్ కేసు) సంజయ్ రౌత్ ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో ఇది వరకు రెండుసార్లు ఆయనకు సమన్లను జారీ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement