కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇవ్వాల (సోమవారం) మరోసారి నోటీసులు జారీ చేసింది. జులై 21న తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఈడీ అధికారులు సోనియాను ఆదేశించారు. గత నెలలో ఈడీ ఎదుట సోనియా హాజరుకావాల్సి ఉండగా.. కరోనా కారణంగా తాను విచారణకు హాజరు కాలేనని దర్యాప్తు సంస్థకు తెలిపారు. కరోనా సోకిన నేపథ్యంలో డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నానని చెప్పిన సోనియా.. కరోనా నుంచి కోలుకునేందుకు తనకు కనీసం 3 వారాల సమయం పడుతుందని, అప్పటిదాకా విచారణకు హాజరు కాలేనని గత నెలలో తెలిపారు. ఇక.. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మూడు వారాల సమయం ఇవ్వాలని కోరారు. సోనియా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ఈడీ అధికారులు.. మరోసారి తాజా నోటీసులు జారీ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాతో పాటు రాహుల్ గాంధీకి కూడా ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement