Monday, November 11, 2024

Followup | ప్రైవేటు మెడికల్​ కాలేజీల్లో అక్రమాలు.. ఏకకాలంలో సోదాలు చేపట్టిన ఈడీ

ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం తెలంగాణలోని కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ఇతర సంస్థలలో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లోని పలు చోట్ల ఉదయం నుంచి ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఇక.. హైదరాబాద్ శివార్ల ఉన్న సూరారంలోని మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో కూడా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కాగా, తెలంగాణ కార్మిక మంత్రి మల్లా రెడ్డికి చెందిన మల్లారెడ్డి గ్రూపు సంస్థల ఆధ్వర్యంలో మల్లారెడ్డి మెడికల్​ కళాశాల నడుస్తోంది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) సిబ్బంది ఈ సోదాలు నిర్వహిస్తున్న చోట ఈడీ బృందాలకు భద్రత కల్పిస్తున్నారు.

అంతేకాకుండా.. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లోని ప్రతిమ గ్రూప్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో కూడా ఈడీ సోదాలు జరిగాయి. ప్రతిమ గ్రూప్‌నకు చెందిన ఇతర కార్యాలయాల్లోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్ కాలేజీ, ప్రతిమ మల్టీప్లెక్స్‌ లో కేంద్ర ఏజెన్సీ సోదాలు చేపట్టింది. కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.

ఎల్బీనగర్​లోని కామినేని మెడికల్ కాలేజీలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, మహబూబ్ నగర్‌లోని ఎస్‌వీఎస్ మెడికల్ కాలేజీ, సంగారెడ్డి జిల్లాలో ఎంఎస్‌ఆర్ మెడికల్ కాలేజీల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు ఆర్థిక లావాదేవీల రికార్డులను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement