Sunday, November 17, 2024

ప్రేమ్ ప్రకాశ్ ఇంట్లో రెండు ఏకే 47 రైఫిల్స్ గుర్తించిన ఈడీ

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు అత్యంత సన్నిహిత నేత ప్రేమ్ ప్రకాశ్ ఇంట్లో రెండు ఏకే 47 రైఫిల్స్ ను అధికారులు ఈడీ అధికారులు గుర్తించారు. చట్టవిరుద్ధ మైనింగ్ కేసులో మనీల్యాండరింగ్ నిబంధనల కింద జార్ఖండ్‌తోపాటు పలు ప్రాంతాల్లో ‌ఈడీ ఈరోజు సోదాలు చేపట్టింది. ఈ దాడుల్లో ప్రేమ్ ప్ర‌కాశ్ ఇంటి ప్రాంగణంలో వీటిని గుర్తించిన‌ట్లు తెలిపారు. అద్దెకు తీసుకున్న ఓ ఇంట్లోని అల్మారలో వీటిని దాచారని చెప్పారు. ప్రేమ్ ప్రకాశ్‌కు సంబంధించి తమకు సమాచారం అందిందని, సీఎం హేమంత్ సోరెన్‌తో కూడా సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఈ దాడులు చేపట్టామని అధికారులు తెలిపారు. ప్రేమ్ ప్రకాశ్ ఇంటి ఆవరణతోపాటు మరో 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని అధికారులు చెప్పారు. జార్ఖండ్, బిహార్, తమిళనాడు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లలో దాడులు జరిపామని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement