డేటా చోరీ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలోకి దిగింది. సైబరాబాద్ పోలీసుల FIR ఆధారంగా కేసు నమోదు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. నితీష్ భూషణ్, పూజా కుమారి, సుశీల్, అతుల్, హసన్, సందీప్ పాల్, రెహ్మాన్ పై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. 16.8కోట్ల మంది డేటా చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రక్షణ రంగానికి చెందిన అధికారుల డేటా కూడా చోరీకి గురైనట్లు తెలిపారు. బ్యాంక్ అకౌంట్లు, క్రికెట్, పాన్ కార్డుల కోసం ఇచ్చిన డేటా లీక్ చేసినట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement