Monday, November 18, 2024

లోన్ యాప్స్ ఆగడాలపై ఈడీ దూకుడు

లోన్ యాప్స్ ఆగడాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈడీ అధికారులు దేశవ్యాప్తంగా 18చోట్ల దాడులు చేస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీల్లోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పేమెంట్ గేట్ వేస్, రోజర్ పే, పేటీఎం పేమెంట్స్, క్యాష్ ఫ్రీ పేటీఎం కంపెనీల్లో సోదాలు జరుగుతున్నాయి. లోన్ యాప్స్ కంపెనీల్లో ఈడీ సోదాలు చేస్తోంది. డబ్బులు బదిలీకి నకిలీ బ్యాంక్ అకౌంట్స్ ను గుర్తించారు. రూ.17కోట్ల క్యాష్ ను ఈడీ సీజ్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement