పంజాబ్ లో ఈడీ దూకుడు పెంచింది. 2018లో ఇసుక తవ్వకాలకు సంబంధించిన కేసును ఈడీ బయటకు తీసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ మేనల్లుడుపై ఈడీ కేసు నమోదు చేసింది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో జరిగిన అవకతవకలపై ఆయనను అరెస్ట్ చేసింది. ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇప్పటికే పది కోట్ల నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. పంజాబ్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి మేనల్లుడు భూపేందర్ సింగ్ పై ఈడీ కేసు నమోదు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..