నిజమైన శివసేన పార్టీని గుర్తించి, ఎన్నికల చిహ్నాన్ని కేటాయించాలని కోరుతూ శివసేన తిరుగుబాటు బృందం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై భారత ఎన్నికల సంఘం (ECI) నిర్దేశించిన ప్రక్రియను అనుసరిస్తామని సీఈసీ రాజీవ్‌కుమార్ చెప్పారు. విడిపోయిన పక్షం అభ్యర్థనపై నిర్ణయం తీసుకునేటప్పుడు ECI “మెజారిటీ పాలన”కి సంబంధించిన పారదర్శక ప్రక్రియను అనుసరిస్తుందని ఆయన చెప్పారు. గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికల సన్నాహాలను సమీక్షించిన ఈసీ ఉన్నతాధికారులు.. గాంధీనగర్‌లో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే గ్రూప్ ‘నిజమైన’ శివసేనగా గుర్తించి దానికి పార్టీ గుర్తును కేటాయించాలని కోరుతూ ECIలో పిటిషన్ దాఖలు అయ్యింది. దీనిపై ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇదిలావుండగా.. గుజరాత్‌లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సన్నాహాలను సమీక్షించడానికి ECI బృందం గాంధీనగర్‌లో వరుస సమావేశాలను నిర్వహించింది. CEC రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండేతో సహా కమిషన్ అధికారులు మొత్తం 33 జిల్లాల ఎన్నికల అధికారులు (DEO), పోలీసు సూపరింటెండెంట్ (SP), రేంజ్ IG, DIGలు ఇతర లా ఎన్‌ఫోర్స్ మెంట్ ఏజెన్సీలతో సమావేశమయ్యారు.