గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రంలోని పరిస్థితిని సమీక్షించేందుకు భారత ఎన్నికల కమిషన్ బృందం ఆ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ, చీఫ్ సెక్రటరీ (సీఎస్)తో పాటు ఇతర సీనియర్ అధికారులతో మూడు రోజులుగా సమావేశాలను నిర్వహించింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలో ఉన్న గుజరాత్‌లో ఈ ఏడాది చివరి నాటికి ఎన్నికలు జరగనున్నాయి. ECI నియమించిన తొమ్మిది మంది సీనియర్ అధికారుల బృందం సెప్టెంబర్ 16, 18 మధ్య అహ్మదాబాద్‌ను సందర్శించింది. ఈ టీమ్ గుజరాత్‌లో రాబోయే ఎన్నికల సన్నాహాలను సమీక్షించింది.
ఇక.. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో జిల్లా ఎన్నికల అధికారులు, కమిషనర్లు, పోలీసు సూపరింటెండెంట్ల సమక్షంలో ఎన్నికల సన్నద్ధతపై గుజరాత్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) పి భారతితో ఈసీఐ బృందం సమీక్ష నిర్వహించింది. ఓటర్ల జాబితా, ప్రత్యేక సారాంశ సవరణ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం/వీవీప్యాట్), పోలింగ్ స్టేషన్లలో కనీస సౌకర్యాలు, సిబ్బంది, రవాణా, శాంతిభద్రతలు, భద్రత, శిక్షణ, సామర్థ్యం పెంపుదల తదితర అంశాలపై వారు వివరంగా చర్చించారు.
కాగా, నోడల్ అధికారులు, ఆదాయపు పన్ను, ఎక్సైజ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డిపార్ట్ మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మొదలైన వివిధ ఎన్‌ఫోర్స్ మెంట్ ఏజెన్సీల ప్రతినిధులతో వివరణాత్మక చర్చలు కూడా జరిపారు. హోమ్, పాఠశాల విద్య, విద్యుత్, టెలికమ్యూనికేషన్, రోడ్డు రవాణా, ఆరోగ్యం.. కుటుంబ సంక్షేమం, ఎక్సైజ్, రెవెన్యూ సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో కూడా సమావేశం జరిగింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీస్ డైరెక్టర్ జనరల్‌తో సమావేశమై రాబోయే ఎన్నికలకు సంబంధించిన పలు సమస్యలతో పాటు సీఈవో, రాష్ట్ర పోలీసు నోడల్ అధికారి, డీఈవో, ఎస్పీ, ఎన్‌ఫోర్స్ మెంట్ ఏజెన్సీల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌పై చర్చించినట్టు తెలుస్తోంది.