ఆఫ్రికలో ఎబోలా వ్యాప్తి మళ్లీ ప్రారంభమైందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. మధ్య ఆఫ్రికాలోని డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో రెండు వారాల క్రితం ఎబోలా వ్యాప్తి మళ్లీ ప్రారంభమైనట్లు మొదలైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. కాంగోలోని ఈక్వెటర్ ప్రావిన్స్‌లోని మబండకా అనే పట్టణంలో ఎబోలా కేసును గుర్తించినట్లు తెలిపింది. దాన్ని అదుపు చేయడానికి అన్ని చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు. ఎబోలాను అదుపుచేయడంలో కాంగోకి ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ అనుభవం ఉందని చెప్పారు. ఆ ప్రాంతంలో ఒక ఎబోలా కేసును అధికారికంగా ధ్రువీకరించారు. 31 ఏళ్ల రోగిలో ఎబోలా లక్షణాలు కనిపించగా, అతడు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందాడని, మూడు రోజుల క్రితం ఎబోలా చికిత్సా కేంద్రంలోని ఐసీయూలో చేరాడని తెలిపారు. రెండు రోజుల క్రితం అతడు మృతి చెందాడని వివరించారు. అనంతరం వైద్య సిబ్బందిలో ఎబోలా లక్షణాలు కనిపించడంతో వారు పరీక్షల కోసం నమూనాలు ఇచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement