తెలంగాణలో ప్రజాస్వామ్యం, ఆత్మ గౌరవం ప్రశ్నార్థకంగా మారిందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజురాబాద్‌లో కాషాయ జెండా ఎగురబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌కు డిపాజిట్ రాదని ఈటల జోస్యం చెప్పారు. ప్రజాబలం ముందు ఏదీ నిలబడదని పేర్కొన్నారు. నాయకులను కొనుగోలు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధన్నారు. ఎన్నికలు కోరుకున్నది టీఆర్‌ఎస్ మంత్రులేనని, తాను రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది వాళ్లేనని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు గొప్పవని చెప్పుకునే పరిస్థితి మాత్రమే ఉందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement