Saturday, November 23, 2024

హుజూరాబాద్ లో రెండేళ్లకోసారి యుద్ధం: ఈటల

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆపార్టీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. 2023లో రాష్ట్రంపై కాషాయ జెండా ఎగురుతుందన్నారు. ‘ప్రజాదీవెన యాత్ర’లో భాగంగా ఆరోరోజు ఆయన హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లందకుంట మండలంలో పాదయాత్ర చేశారు. రెండేళ్లకోసారి హుజూరాబాద్ లో ఎందుకో యుద్ధం చేయాల్సి వస్తోందని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. 2008, 2010లో రాజీనామా చేస్తే భారీ మెజారిటీతో తనను గెలిపించారని, ప్రజలే తనకు ఎన్నికల కోసం డబ్బులిచ్చారని తెలిపారు. ఆరుసార్లు తాను ఎమ్మెల్యేగా గెలిచినా ధర్మంగానే గెలిచానని చెప్పారు. తన పక్కన ఎవరూ ఉండకుండా చేసేందుకు ఎత్తులు వేస్తున్నారని మండిపడ్డారు. వారు డబ్బు, అధికారాన్ని నమ్మితే తాను ప్రజలనే నమ్ముకున్నానని చెప్పారు. టీఆర్ఎస్ బీఫాంతోనే తాను గెలిస్తే.. మరి, మిగతా టీఆర్ఎస్ నేతలు ఎందుకు ఓడిపోయారని ఈటల ప్రశ్నించారు.

ఇది కూడా చదవండిః గుట్కా తీసుకునే మంత్రులా ఈటలను ఓడించేది?: బండి

Advertisement

తాజా వార్తలు

Advertisement