Tuesday, November 26, 2024

బీజేపీలో ఈటలకు కీలక పదవి? మరి సీఎం పదవిపై మాటేంటి?

తెలంగాణ రాజకీయాలు మాజీ మంత్రి ఈటల రాజేందర్ చుట్టూనే తిరుగుతున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో ఆయన కాషాయ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు బీజేపీలో ఎలాంటి ప్రాధాన్యత లభిస్తుంది. ఏదైనా కీలక పదవి ఇస్తారా? లేక తొలి నుంచి ప్రచారం జరుగుతున్నట్లు రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రిని చేస్తారా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ప్రస్తుతం తెలంగాణ నుంచి కేంద్రంలో కిషన్ రెడ్డి ఒక్కరే మంత్రిగా ఉండడంతో ఈటలకు బెర్త్ కర్ఫార్మ్ అనే టాక్ వినిపిస్తోంది.

మంత్రివర్గం నుంచి ఈటల బర్తరఫ్ తరువాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయం ఎన్నో మలుపులు తిరిగాయి. ఈటలను ఏకాకని చేసేందుకు అధికార టీఆర్ఎస్ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. గులాబీ క్యాడర్ ను ఈటల వెంట వెళ్లకుండా కట్టడి చేసే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే, ఈటల రాకను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొందరు నాయకులు వ్యతిరేకిస్తున్నారనే టాక్ ఉంది. ముఖ్యంగా మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ఈటల రాకపై అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఈటల బీజేపీలో చేరితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాషాయ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది.

తెలంగాణలో 2023లో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పావులు కదుపుతున్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జిల్లా వాసి కావడంతో మరింత ప్రాధాన్యత పెరిగింది. అయితే, ఈటల రాకను అందరు ఆహ్వానించాలని బండి ఇప్పటికే ఉమ్మడి జిల్లా క్యాడర్ కు స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి ఈటల లాంటి కీలక నేతల అవసరం చాలా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈటల చేరికను వ్యతిరేకిస్తున్న నాయకులని సైతం బుజ్జగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈటల బీజేపీలో చేరితే కరీంనగర్‌లో బీజేపీ మరింత పట్టు సాధిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తుందని జోరుగా ఉహాగానాలు వినిపిస్తున్నాయి.  ఇలాంటీ పరిస్థితిలో ఈటలకు ఎలాంటి పదవిని కట్టబెడతారనే దానిపై సీరియన్ గా చర్చ జరుగుతోంది. అంతే కాదు ఈటల ఏకంగా సీఎం రేసులోనే ఉంటారని ఆయన అనుచరులు చెబుతున్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement