Thursday, November 21, 2024

Big Breaking | బీజేపీ అగ్రనేతలతో ఈటల, రాజగోపాల్​ భేటీ.. నచ్చజెప్పేందుకే పిలిచారా?

తెలంగాణ బీజేపీ నేతలు ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఇవ్వాల (శనివారం) న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో జరిగే పరిణామాలను పార్టీలో నెలకొన్న పరిస్థితులను వారు హై కమాండ్​కి వివరించనున్నట్టు తెలుస్తోంది. కాగా, వీరిని పార్టీ వీడకుండా నచ్చజెప్పేందుకే ఢిల్లీ పిలిచినట్టు తెలస్తోంది.

కాగా, కొంతకాలంగా పార్టీ పనితీరుపై ఈటల, కోమటిరెడ్డి అసంతృప్తితో ఉన్నారని, పార్టీని వీడనున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు వీరిద్దరు నేతలు దూరంగా ఉన్నారు. దీంతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో ఈటల విభేదిస్తున్నట్లు సమాచారం. ఇక.. శనివారం మీడియాతో మాట్లాడిన రాజ్ గోపాల్ రెడ్డి.. తాను ఇంకా బీజేపీలోనే ఉన్నానని చెప్పారు. తన అభిప్రాయాన్ని హైకమాండ్ ముందు ఉంచుతానని, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలో కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేస్తానని చెప్పారు.

కర్నాటక బీజేపీ చీఫ్​ రాజీనామా..

కర్నాటక బీజేపీ అధ్యక్షుడు ఇవ్వాల (శనివారం) రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ తన రాజీనామాను సమర్పించినట్టు నలిన్​ కుమార్ తెలిపారు. దీనిపై పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement