టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత మాజీ మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో చిట్ చాట్ సందర్భంగా తన రాజకీయ భవిష్యత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరికపై స్పష్టత ఇచ్చారు. వచ్చే వారం ఢిల్లీలో బీజేపీలో చేరుతానని ఈటల రాజేందర్ ప్రకటించారు. ”నాది లెఫ్ట్ భావజాలమైనా ప్రస్తుత పరిస్థితులు బీజేపీ వైపు నడిపించాయి. ఢిల్లీలో బీజేపీ నేతలందరీనీ కలిశా. అమిత్ షాతో ఫోన్‌లో మాట్లాడాను. వారం రోజుల తర్వాత బీజేపీలో చేరిక ఉంటుంది. నేను బీజేపీలో చేరిన తర్వాత చాలా మంది ఉద్యమకారులు బీజేపీలోకి వస్తారు. బీజేపీ అగ్రనేతల సమావేశంలో టీఆర్ఎస్ తో సంబంధాల గురించే మొదటగా ప్రస్తావించా. టిఆర్ఎస్ లో తన కంటే ఎంతో మంది ఎక్కువ అవమానాలకు గురయ్యారు. పరిస్థితులు చక్కబడ్డాక బహిరంగ సభ నిర్వహిస్తాం. స్పీకర్ సమయం ఇస్తే నేరుగా కలిసి రాజీనామా లేఖను అందజేస్తా. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఓడించేందుకు టిఆర్ఎస్ ప్రయత్నించింది. ఇప్పటికే హుజురాబాద్ నియోజవర్గంలో టిఆర్ఎస్ రూ.50 కోట్లు ఖర్చు పెట్టింది” అని ఈటల రాజేందర్ అన్నారు.
కాగా, ఈటల రాజేందర్‌తో పాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్, కరీంనగర్ మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తులా ఉమ, మరికొందరు నేతలు కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు.
ఇది కూడా చదవండి: బ్రేకింగ్: టీఆర్ఎస్ పార్టీకి ఈటల రాజీనామా