మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో భూకంపం వచ్చింది. దీని తీవ్రత 6.0గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. భూకంప కేంద్రం కౌలాలంపూర్‌కు 384 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొంది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని చెప్పింది. కాగా ఇండోనేషియాలో కూడా భారీ భూకంపం సంభవించింది. ఉదయం 7.09 గంటలకు బుకిటిన్గీకి సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత 6.2గా నమోదయిందని, భూకంప కేంద్రం బుకిటిన్గీకి 66 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. భూఅంతర్భాగంలో 12.3 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని వెల్లడించింది. ప్రస్తుతానికి ఎలాంటి సునామీ హెచ్చరికలు లేవని వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..