Tuesday, November 26, 2024

ఆరు గంట‌ల వ్య‌వ‌ధిలో నాలుగు భూకంపాలు-ప్రాణ‌న‌ష్టం లేద‌న్న అధికారులు

ఆరుగంట‌ల వ్య‌వ‌ధిలో నాలుగు వ‌రుస భూకంపాలు సంభ‌వించాయి. మంగళవారం ఎనిమిది గంటల కంటే తక్కువ సమయంలో నాగులు భూకంపాలు సంభ‌వించాయని అధికారులు తెలిపారు.. ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేద‌ని అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 2.20 గంటలకు సంభవించిన భూకంప కేంద్రం జమ్మూ ప్రాంతంలోని కత్రా ప్రాంతానికి తూర్పున 61 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృత‌మై ఉందన్నారు. 10 కిలోమీటర్ల లోతులో ఉత్తర అక్షాంశం 33.07 డిగ్రీలు, తూర్పు రేఖాంశం 75.58 డిగ్రీల వద్ద భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు.

రెండవ భూకంపం రిక్టర్ స్కేలుపై 2.6 తీవ్రతతో ఈశాన్యంగా 9.5 కి.మీ దోడాజమ్మూ ప్రాంతంలో తెల్లవారుజామున 3.21 గంటలకు సంభ‌వించింద‌ని అధికారులు తెలిపారు. భూకంపం 33.23 డిగ్రీల ఉత్తర అక్షాంశం-75.56 డిగ్రీల తూర్పు రేఖాంశంలో 5 కి.మీ లోతులో న‌మోదైంది. 2.8 తీవ్రతతో మూడో భూకంపం తూర్పున 29 కి.మీ దూరంలో సంభవించింది. ఉధంపూర్ లో ఈ రోజు తెల్లవారుజామున 3.44 గంటలకు జమ్మూ ప్రాంతంలో మ‌రో భూకంపం సంభ‌వించింద‌ని స్థానికులు, అధికారులు తెలిపారు. 10 కిలోమీటర్ల లోతులో ఉత్తర అక్షాంశం 32.89 డిగ్రీలు-తూర్పు రేఖాంశం 75.45 డిగ్రీల వద్ద భూకంపం సంభవించింది. ఉదంపూర్‌కు ఆగ్నేయంగా 26 కిలోమీటర్ల దూరంలో ఉదయం 8.03 గంటలకు 2.9 తీవ్రతతో నాలుగో భూకంపం సంభవించినట్లు జ‌మ్మూకాశ్మీర్ అధికారులు తెలిపారు. భూకంపం ఉత్తర అక్షాంశం 32.83 డిగ్రీలు-రేఖాంశం 75.40 డిగ్రీల తూర్పున 5 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృత‌మై ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement