కర్ణాటకలో భూకంపం సంభవించింది. ఉత్తర, ఈశాన్య బెంగళూరులో భూప్రకంపనలు స్థానిక ప్రజలను వణికించాయి. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 3.3గా నమోదైంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ(National Center for Seismology) వెల్లడించింది. ఈ ఉదయం 7.09 గంటలకు ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. భూకంప కేంద్రం భూమికి 23 కిలోమీటర్ల లోతున ఉందని చెప్పింది. భూప్రకంపనలతో ఉలిక్కి పడిన జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే, ఈ భూకంపంతో ఎలాంటి ఆస్తి, ప్రాణం సంభవించలేదని తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital