ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో బుధవారం తెల్లవారుజామున భూమి కంపించింది. దీని తీవ్రత 3.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయని వెల్లడించింది. ఒక్కసారిగా అర్ధరాత్రి భూమి ప్రకంపనలకు గురికావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. అదేవిధంగా నేపాల్ లో కూడా భూమి స్వల్పంగా కంపించింది. బాగ్‌లంగ్ జిల్లాలో వరుసగా రెండు సార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.7గా నమోదయింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement