గత కొన్ని రోజులుగా టర్కీపై భూకంపం పగబట్టినట్టుంది. మరోసారి ఆ దేశంలో భూకంపం సంభవించింది. ఇవాళ వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.1 గా భూకంపం సంభవించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. దక్షిణ టర్కీ నగరంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చినట్లు భూకంప కేంద్రం ఉన్నట్టు పేర్కొంది. మొదటిసారిగా టర్కీ, సిరియాలో భూకంపం రాగా.. మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. టర్కీ, సిరియాలో భూకంప మృతుల సంఖ్య ఈరోజు వరకు 46వేలు దాటిన సంగతి విదితమే. అయితే మళ్లీ భూకంపం రావడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement