గతంలో టర్కీ, సిరియాలో భారీ భూకంపం సంభవించడంతో అతలాకుతలమైంది. ఈ ఘటన మరిచిపోకముందే మళ్లీ టర్కీలో భూకంపం వచ్చింది. నెలల క్రితం భారీ భూకంపంతో అతలాకుతలమైన టర్కీలో మరోసారి భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. సోమవారం తెల్లవారుజామున 4.25 గంటలకు అఫ్సిన్ నగరంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.0గా నమోదయిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని తెలిపింది. ప్రకృతి సృష్టించిన పెను వీళయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలు.. మరోసారి భూకంపం రావడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement