నాసిక్ లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదయింది. భూకంపం వచ్చినట్టుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ ఘటనతో ప్రజలు ఇళ్లనుండి బయటికి పరుగు పెట్టారు. నాసిక్ కి పశ్చిమాన 88కిలో మీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. మణిపూర్‌లోని ఇంఫాల్‌కు పశ్చిమ-వాయువ్యంగా భూకంపం సంభవించినట్టు , రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఎన్‌సిఎస్ తెలిపింది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు. కాగా.. ఈ భూకంపం ప్రభావం చుట్టుపక్కల రాష్ట్రాలపైనా పడింది.. పలు చోట్ల స్వల్పంగా భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..