జమ్మూ కాశ్మీర్ లో భూకంపం వచ్చింది. భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.7 గా నమోదైంది. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి భయపడి వీధుల్లోకి పరుగులు తీశారు. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు భయకంపితులయ్యారు. జమ్మూకాశ్మీర్, నోయిడా, ఉత్తరాఖండ్ లో ఈ భూప్రకంపనలు జరిగినట్లు అధికారులు చెప్పారు. పొరుగుదేశమైన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ లోనూ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అయితే ఈ భూ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. ఒక్కసారిగా భూమి కంపిచండంతో ప్రజలు భయకంపితులయ్యారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement