ఢిల్లీలో కొద్దిసేపటి క్రితం భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అదేవిధంగా ఉత్తర భారతాన పెద్ద ఎత్తున భూకంపం సంభవించినట్టు సమాచారం అందుతోంది. రిక్టర్ స్కేలుపై 7.7గా ఉందని తెలుస్తోంది. ఇక ఆప్ఘనిస్తాన్‌లోనూ భూకంపం సంభవించినట్టు సమాచారం అందుతోంది.. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో మంగళవారం 6.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర భారతదేశం, పాకిస్తాన్‌లో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయి. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని జుర్మ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. రిక్టర్ స్కేల్‌పై 6.6 తీవ్రతతో భూకంపం రాత్రి 10:17 గంటలకు ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌లోని 133 కిమీ SSEని తాకింది.