Saturday, November 23, 2024

అరుణాచల్‌ప్రదేశ్‌లో భూకంపం.. భ‌యంతో ప‌రుగులు తీసిన జ‌నం

అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఇవ్వాల‌ (శుక్రవారం) మధ్యాహ్నం భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 12.39 గంటలకు రిక్టర్‌ స్కేల్‌పై 4.2తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది. చాంగ్లాంగ్‌కు 222 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు.

భూ ప్రకంపనలతో జనం భయంతో పరుగులుపెట్టారు. అంతకు ముందు ఉదయం 7.46 గంటలకు హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 3.5 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని, ధర్మశాలకు వాయువ్యంగా 57 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement