ఇటీవలే కాలంలో పలు ప్రాంతాల్లో అధిక స్థాయిలో భూకంపాలు వస్తున్నాయి. టర్కీ, సిరియా లలో భారీ భూకంపం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.. అయితే తాజాగా… అఫ్గానిస్థాన్‌లోని ఫైజాబాద్‌లో మరోసారి భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 2.35 గంటల సమయంలో ఫైజాబాద్ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. ఫైజాబాద్‌కు 267 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. తెల్లవారుజామున భూకంపం రావడంతో ప్రజలు ఇండ్లనుంచి బయటకు పరుగులు తీశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement