Wednesday, November 20, 2024

జ‌పాన్ లో మ‌రోసారి భూకంపం .. ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేద‌న్న అధికారులు ..

భూకంపంతో వ‌ణికిపోయింది జ‌పాన్.. రీసెంట్ గా భూకంపం రాగా మ‌ళ్ళీ మ‌రోసారి భూకంపం చోటు చేసుకోవ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కి గురి అయ్యారు. జపాన్ దేశం రింగ్ ఆఫ్ ఫైర్లో భూకంప క్రియాశీల జోన్‌లో ఉంది. ఇక్కడ తరుచుగా శక్తివంతమైన భూకంపాలు సంభవిస్తాయి. కాగా జ‌పాన్ ఆగ్నేయ ప్రాంతం అతిపెద్ద ద్వీపం హోన్షులో రిక్ట‌ర్ స్కేలుపై 5.4తీవ్ర‌త‌తో భూకంపం న‌మోద‌యింది. భూకంపం కేంద్రం వాకయామా ప్రిఫెక్చర్ వద్ద 20 కిలోమీటర్ల (12 మైళ్ల కంటే ఎక్కువ) లోతులో కేంద్రీకృత‌మ‌యింది. క్యుషు .. షికోకు దీవులతో సహా 23 ప్రిఫెక్చర్‌లలో ప్రకంపనలు సంభవించాయి. భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి , ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఎలాంటి సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement