Thursday, November 21, 2024

చంద్రుడిపై ఉద‌యిస్తున్న భూమి.. వీడియో రిలీజ్ చేసిన కగుయాలోని అత్యాధునిక కెమెరాలు

మ‌న‌కు సూర్యోద‌యం అయిన‌ట్లే.. చంద్రుడిపై భూమి ఉద‌యిస్తుంద‌ట‌. దీనికి సంబంధించిన అద్భుత దృశ్యాలను జపాన్ కు చెందిన లూనార్ ఆర్బిటర్ స్పేస్ క్రాఫ్ట్ కగుయా చిత్రీకరించింది. చంద్రుడి ఉపరితలం మీదుగా పుడమి ఉదయిస్తుండడాన్ని కగుయాలోని అత్యాధునిక కెమెరాలు బంధించాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విశేషంగా ఆకట్టుకుంటోంది. భూమిపై సూర్యోదయం, సూర్యాస్తమయాలు జ‌ర‌గ‌డం తెలిసిందే. అలాగే భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్నట్టే…. భూమి చుట్టూ చంద్రుడు పరిభ్రమిస్తుంటాడు. భూమికి చంద్రుడు ఉపగ్రహం. మనకు సూర్యోదయం అయినట్టే, చంద్రుడిపై భూమి ఉదయిస్తుండ‌టం ఆక‌ట్టుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement