Wednesday, November 20, 2024

Punjab Election Results: పంజాబ్ ను ఊడ్చేసిన కేజ్రీవాల్.. మ్యాజిక్‌ ఫిగర్‌ దాటిన ఆప్

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే వెలువడుతున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్ గోవా రాష్ట్రాల్లో కమల వికాసం ఉండగా.. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) హవా నడుస్తోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో మ్యాజిక్ ఫిగర్‌ ను దాటేసింది. రాష్ట్రంలో 88 స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక, ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ పార్టీ కేవలం 15 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. ఇక్కడ సర్కారు ఏర్పాటుకు 59 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుత సరలి చూస్తే ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ సీఎం అన్నీ రెండు చోట్ల వెనుకబడి పోయారు.

పంజాబ్‌లోని 117 అసెంబ్లీ స్థానాల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రధాన పోటీ ఇచ్చింది. అయితే, కాంగ్రెస్ బహుముఖ పోటీలో అధికారాన్ని నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement