డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించేందుకు ఎలక్ట్రానిక్ వోచర్ ఈ-రూపీ ( e-RUPI ) ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈరూపీ వోచర్‌ను విడుదల చేశారు. డిజిటల్ లావాదేవీలు, నేరుగా నగదు బదిలీ విషయంలో దేశంలో ఈరూపీ కీలకపాత్ర పోషించనున్నట్లు మోదీ తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో 21వ శతాబ్ధంలో ఇండియా ముందుకు వెళ్తున్న తీరుకు ఈ-రూపీని ఉదాహరణగా భావించవచ్చు అని ఆయన చెప్పారు.
దేశంలో డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం ఈ-రూపీని తీసుకువచ్చింది. దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) అభివృద్ధి చేసింది. దీని ద్వారా, నగదు రహిత, కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు చేసే అవకాశం లభిస్తుంది. ప్రస్తుత పేమెంట్ విధానాలకంటే సులభంగా క్యాష్‌లెస్, కాంటాక్ట్‌లెస్‌గా ఉండేలా ఈ-రూపీ పేమెంట్ వ్యవస్థ(E-RUPI)ను ప్రవేశపెట్టారు. ఈ-రూపీ చెల్లింపులో నగదు చెల్లింపులను క్యూర్ కోడ్ లేదా ఎస్‌ఎమ్మెస్ స్ట్రింగ్ వోచర్‌ల ద్వారా లబ్ధిదారుడి మొబైల్ ఫోన్‌కి పంపిస్తారు. ఈ వోచర్ లేదా క్యూఆర్ కోడ్‌ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట వినియోగించుకోవచ్చు.
ఇది కూడా చదవండి: రాజీనామాకు సిద్ధమైన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్!