Saturday, November 23, 2024

Breaking: సీజేఐగా డీవై చంద్రచూడ్​ ఖరారు.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ముర్ము

భారత రాజ్యాంగ అధికారాన్ని ఉపయోగించి జస్టిస్ డీవీ చంద్రచూడ్‌ను సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవ్వాల (సోమవారం) నియమించారు. నవంబర్ 9వ తేదీన భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్ భాద్యతలు చేపట్టనున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సోమవారం ఒక ట్వీట్‌లో ఈ విషయం తెలిపారు. కొత్త సీజేఐకి అభినందనలు తెలిపారు.

ఇక.. సీజేఐ నియామక సంప్రదాయ ప్రకారం పదవీ విరమణ చేయనున్న సీజేఐ యూయూ లలిత్ కొత్త సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును అక్టోబర్ 11న కేంద్రానికి సిఫారసు చేశారు. దాన్ని రాష్ట్రపతి ఆమోదానికి కేంద్రం పంపడంతో జస్టిస్ చంద్రచూడ్ నియామకానికి రాష్ట్రపతి సోమవారం ఆమోదం తెలిపారు. సీజేఐ పదవిలో జస్టిస్ చంద్రచూడ్ రెండేళ్ల పాటు అంటే 2024 నవంబర్ 10 వరకూ కొనసాగుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement