హైదరాబాద్‌లోని ఐకానిక్ సెంటర్ అయిన దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి నిర్వహణ పనులు జరగనున్నాయి. దీనికోసం మూడు రోజులపాటు బ్రిడ్జిపై రాకపోకలను నిలిపేయనున్నట్టు జీహెచ్ఎంసీ తెలిపింది. కేబుల్ బ్రిడ్జి పనులు, స్టే కేబుల్ సిస్టమ్‌లో కొన్ని తనిఖీలను చేపట్టాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నిర్ణయించింది. ఈ క్రమంలో బ్రిడ్జిపై 100 టన్నుల అతిపెద్ద క్రేన్లతో పనులు జరగనున్నాయి. కేబుల్ బ్రిడ్జి పైలాన్ P1, P2 వద్ద తనిఖీ చేపట్టాల్సిన అవసరం ఉన్నందున క్రేన్‌లు క్యారేజ్‌వేను పూర్తిగా ఆక్రమిస్తాయి. అందుకని వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడనుంది.
కాగా, ఈ దారిలో ట్రాఫిక్ సజావుగా సాగేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఏప్రిల్ 6వ తేదీ అర్ధరాత్రి నుంచి ఏప్రిల్ 10వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ రూట్లలో ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టనున్నట్టు వెల్లడించారు..
- రోడ్ నంబర్ 45 నుండి కేబుల్ బ్రిడ్జ్ మీదుగా గచ్చిబౌలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వద్ద రోడ్డు నెం 45లోకి మళ్లిస్తారు. అక్కడే – కుడి మలుపు – మాదాపూర్ L&O PS వైపు – ఎడమ మలుపు – COD జంక్షన్ – సైబర్ టవర్లు -, ఎడమ మలుపు – నిమ్మ చెట్టు జంక్షన్ – IKEA రోటరీ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
- రోడ్ నెం 45 నుండి కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలి వైపు వచ్చే ట్రాఫిక్ రోడ్డు నెం.45లోని డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ వద్ద మళ్లించనున్నారు. – కుడి మలుపు – డి-మార్ట్ ముందు, ఎడమ మలుపు – వసంత్ ఎంబ్రాల్డ్ గార్డెన్స్, – ఎడమ మలుపు – HMWSSB -, కుడి మలుపు – నెక్టార్ గార్డెన్ రోడ్డు. – సంప్రదాయ, ఎడమ మలుపు, నెక్టార్ గార్డెన్ కాలనీ.. కుడి మలుపు నెక్టార్ గార్డెన్ జంక్షన్ – లెఫ్ట్ టర్న్ – దుర్గం చెరువు – I ల్యాబ్స్ U-టర్న్ – ITC కోహినూర్ – మై హోమ్ అబ్రా జంక్షన్ – C గేట్ జంక్షన్ – Ikea రోటరీ – ఎడమ మలుపు – బయో డైవర్సిటీ జంక్షన్ వైపు వెళ్లాలి.
- IKEA రోటరీ నుండి కేబుల్ వంతెన మీదుగా జూబ్లీహిల్స్ వైపు వచ్చే ట్రాఫిక్ ఇన్-ఆర్బిట్ మాల్ – ఎడమ మలుపు – I-ల్యాబ్స్ -, దుర్గం చెరువు, – COD జంక్షన్, – కుడి మలుపు.. – అయ్యప్ప సొసైటీ, – మాదాపూర్ L&O PS, – కావూరి హిల్స్ జంక్షన్, – జూబ్లీహిల్స్ వద్ద మళ్లించనున్నారు.
- ఐకియా రోటరీ నుండి కేబుల్ బ్రిడ్జి మీదుగా జూబ్లీహిల్స్ వైపు వచ్చే ట్రాఫిక్ ఇన్-ఆర్బిట్ మాల్ – ఎడమ మలుపు – ఐ-ల్యాబ్స్, – దుర్గం చెరువు, – నెక్టర్ గార్డెన్ జంక్షన్ ,- కుడి మలుపు.. – డాక్టర్స్ కాలనీ, – కుడి మలుపు.. – డి – మార్ట్ – యు-టర్న్ వద్ద టర్న్ చేసుకోవాల్సి ఉంటుంది.
దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రూట్లో జర్నీ చేసే వాహనదారులు.. ప్రయాణికులందరూ ట్రాఫిక్ డైవర్షన్‌ని పాటించాలని, పోలీసులు సలహాను అనుసరించి ట్రాఫిక్ సజావుగా ఉండేలా సహకరించవలసిందిగా కోరారు.