Saturday, November 23, 2024

నకిలీ సర్టిఫికెట్ల త‌యారీ : ముఠా అరెస్టు

వరంగల్ దేశంలో గుర్తింపు కలిగిన వివిధ విశ్వ విద్యాలయాలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను తయారుచేసి వాటి ద్వారా విద్యార్థులను విదేశాలకు తరలిస్తున్న పన్నెండుమంది ) సభ్యుల ముఠాను వరంగల్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారు . ఈ ముఠా సభ్యుల నుండి దేశంలో వివిధ విశ్వ విద్యాలయాలకు సంబంధించి 212 నకిలీ సర్టిఫికెట్లు , 6 ల్యాప్ టాప్ లు , 1 ఐపాడ్ , 2 ప్రింటర్లు , 5 సిపియూలు , 25 నకిలీ రబ్బర్ స్టాంపులు , 2 ప్రింటర్ రోలర్స్ , 5 ప్రింటర్ కలర్స్ బాటిల్స్ , 1 లామినేషన్ మిషన్ , 12 సెల్ఫోన్లు , 10 లామినేషన్ గ్లాస్ పేపర్స్ వున్నాయి .

పోలీసులు అరెస్టు చేసిన నిందితుల వివరాలు : దార అరుణ్ ( ప్రధాన నిందితుడు , నకిలీ సర్టిఫికేట్ల సృష్టికర్త తండ్రి పేరు యాదగిరి , వయస్సు 28 , నివాసం ఆర్టీసీ బస్టాండ్ రోడ్ , మహబూబాబాద్ జిల్లా కేంద్రం , 2. ఆకుల రవి అవినాష్ , తండ్రిపేరు రవికుమార్ , వయస్సు 33 , ద్వారక పేట్ రోడ్ , నర్సంపేట్ , వరంగల్ జిల్లా , 3. మామిడి శ్రీకాంత్ రెడ్డి ( కన్సల్టెన్సీ ) , తండ్రి పేరు రవికుమార్ , వయస్సు 38 , కనకదుర్గ కాలనీ , వడ్డెపల్లి , హన్మకొండ , 4. అనందుల మహేష్ ( కన్సల్టెన్సీ ) , రామచంద్ర . వయస్సు 30 , గ్రామం నాచినపల్లి , దుంది మండలం , వరంగల్ జిల్లా . 5. మీర్జా అక్తర్ అలీ బేగ్ , తండ్రిపేరు మీర్జా ఆక్రం , వయస్సు 30 , పోస్టల్కాలనీ , సుబేదారి , హన్మకొండ , 6. మాదిశెట్టి సచిన్ ( కన్సల్టెన్సీ ) , తండ్రిపేరు కృష్ణమూర్తి , వయస్సు 30 , నెహ్రూనగర్ , మడికొండ , హన్మకొండ , 7. చిదాల సలోనీ అలియాస్ రాధ , భర్తపేరు రాజశేఖర్ , వయస్సు 30 , ఐశ్వర్యనగర్ , ఘట్కేసర్ , హైదరాబాద్ , 8. పోగుల సుధాకర్ రెడ్డి , తండ్రిపేరు నర్సిరెడ్డి , వయస్సు 49 . ఎక్సైజ్కాలనీ , సుబేదారి హన్మకొండ , 9 , మామిడి స్వాతి , భర్తపేరు సందీప్ రెడ్డి , వయస్సు 36 , ఎక్సైజ్కిలనీ , సుబేదారి హన్మకొండ , 10 , బాలాజు శ్రీనాధ్ . తండ్రిపేరు దేవేందర్ , గాంధీనగర్ , హన్మకొండ .11 . నల్లా ప్రణయ్ , తండ్రి పేరు చేరాలు , వయస్సు 27 , గుండ్లసింగారం , హన్మకొండ , 12. అంబటి ఉత్తమ్ కిరణ్ , తండ్రిపేరు రామస్వామి , వయస్సు 37 , సుబేదారి , హన్మకొండ :

ప్రస్తుతం పరారీలో వున్న నిందితులు : హైదరాబాద్ కి చెందిన కాస శ్రీనివాస్ యాదవ్ తో పాటు , హన్మకొండకు చెందిన కుందారపు కృష్ణా , నరిశెట్టి సురేందర్ వున్నారు . ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా . తరుణ్ జోషీ వివరాలను వెల్లడిస్తూ.. దార అరుణ్ . ఆకుల రవి అవినాష్ ఇద్దరు ప్రధాన నిందితులుగా ఉన్నార‌ని చెప్పారు . వీరు ఇరువురుకి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని కలిగివుండటంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇంటర్ నెట్ సెంటర్ ని నిర్వహిస్తుండేవారు. ఈ నెట్ సెంటర్ ద్వారా వచ్చే ఆదాయం తన జీవనానికి సరిపోకపోవడంతో పాటు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకోవాలనుకున్నారు . ఇందులో భాగంగా ప్రధాన నిందితులిద్దరు తమకున్న కంప్యూటర్ పరిజ్ఞానంతో తొలిరోజుల్లో చిన్నచిన్న నకిలీ సర్టిఫికేట్లను తయారు చేసేవాడు . ఈ విధంగా నకిలీ సర్టిఫికెట్లను తయారు చేయడం ద్వారా వచ్చే ఆదాయం పెద్ద మొత్తంలో వుండటంతో నిందితులు కావల్సిన వ్యక్తలకు దేశంలోని వివిధ విశ్వవిద్యాలయలు , డ్రీముడ్ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి అందజేసేవారు .

ప్రధాన నిందితులు దార అరుణ్ , ఆకుల రవి అవినాష్ సహకారంతో హన్మకొండ , పరిధిలోని కోన్ని కన్సల్టెన్సీ సంస్థలు విదేశాల్లో విద్య అభ్యసించాలనుకునే వ్యక్తులు , విద్యార్థులకు ఎలాంటి విద్యార్హతలు లేకున్నా ఆయా , ఆయా కన్సల్టెన్సీ యాజమాన్యం తమ కావల్సిన విద్యాసంస్థలకు సంబంధించిన సర్టిఫికెట్ను తయారు చేయాల్సిందిగా నిందితుడు దార అరుణ్ , ఆకుల రవి అవినాష్ కు కన్సల్టెన్సీవారు . సమాచారం ఇచ్చేవారు .వీరు ఇచ్చిన సమాచారం మేరకు నిందితులు ఆరుణ్ , అవినాష్ లు నకిలీ నకిలీ సర్టిఫికేట్ తయారు చే న్సల్టెన్సీ సంస్థకు అందజేసేవారు . ఈ నకిలీ సర్టిఫికేటు వినియోగించుకోని కన్సల్టెన్సీ సంస్థలు విద్యార్థులను లాంటి విద్యార్హత లేకున్న విదేశాలకు వెళ్ళేందుకు మార్గం సులభం చేసేవారు . అదే విధంగా ఈ నకిలీ సర్టిఫికెట్ల తయారు చేసే ఈ ముఠా మరో అడుగు ముందుకేసి కొన్ని విదేశాల్లోని విద్యాలయాల్లో అడ్మిషన్ పొందేందుకుగాను కనీస మార్కుల శాతాన్ని తప్పనిసరి చేయడంతో కొద్ది మంది విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఉత్సహంతో విదేశీ విద్యా సంస్థల్లో చదివేందుకుగాను తమకు వుండాల్సిన కనీస మార్కుల శాతం లేని విద్యార్థులకు సైతం ఈ ముఠా సభ్యులు విద్యార్ధుల ఓరిజినల్ మార్కుల సర్టిఫికేట్ను ఆధారంగా చేసుకోని కావల్సిన అధిక మార్కులతో కూడిన నకిలీ సర్టిఫికేట్లను తయారు చేసేవారు . అలాగే కోన్ని విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకున్న విద్యార్థులు మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులైన వుండాలని విదేశీ విశ్వ విద్యాలయాలు విద్యార్థులకు నియమం పెట్టడంతో ఈ నియమాన్ని సైతం ముఠా సభ్యులు తమ అనుకూలంగా మార్చుకోని వివిధ సెమిస్టర్లలో ఫెయిల్ అయిన మొదటి ప్రయత్నంలోనే పాస్కనీ విద్యార్థులకు సైతం మొదటి ప్రయత్నంలోనే పాస్ అయినట్లుగా సకిలీ సర్టిఫికేట్లను తయారు చేసి అందజేస్తారు .

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement