డీజే అంటేనే విపరీతమైన సౌండ్స్ తో దద్దరిల్లుతుంది.అయతే ఈ డీజేలో ఓ 18ఏళ్ల యువకుడు కుప్పకూలాడు.. మధ్యప్రదేశ్‌లో ఓ 18 ఏళ్ల యువకుడు హై వాల్యూమ్ మ్యూజిక్‌తో డీజే ముందు డ్యాన్స్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు.ఉజ్జయిన్ జిల్లాకు చెందిన అంబోడియా నివాసి లాల్ సింగ్ తాజ్‌పూర్ వెళ్లి తన మిత్రుడి వివాహానికి హాజరయ్యాడు. పెళ్లి వేడుకలు మాంచి హుషారు మీద సాగుతున్నాయి. పెళ్లి కొడుకు ఊరి నుంచి బారాత్ బయల్దేరింది. లాల్ సింగ్, ఆయన మిత్రులు ఈ బారాత్‌లో జోరుగా డ్యాన్స్ చేశారు. డీజే బాక్సుల వెనుక చిందులు వేస్తూ వీడియోలు రికార్డు చేసుకున్నారు. అప్పుడే ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. డీజే చప్పుళ్లు, సంబురాల మధ్యనే లాల్ సింగ్ ఉన్నట్టుండి, కుప్పకూలిపోయాడు. లాల్ సింగ్ స్థిమితం కోల్పోయి నేలపై పడిపోయాడు. దీంతో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. వెంటనే సమీప హాస్పిటల్‌కు లాల్ సింగ్‌ను తీసుకెళ్లారు. కానీ, ఆ హాస్పిటల్ సిబ్బంది లాల్ సింగ్‌ను ఉజ్జయిన్ హాస్పిటల్ తీసుకెళ్లాల్సిందిగా సూచనలు చేశారు. ఉజ్జయిన్ హాస్పిటల్ చేరగానే లాల్ సింగ్ అప్పటికే మరణించాడని వైద్యులు చెప్పారు. లాల్ సింగ్ పోస్టుమార్టం రిపోర్టుపై నిపుణులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ 18 ఏళ్ల పిల్లాడి గుండెలో రక్తం గడ్డకట్టినట్టు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. ఉజ్జయిన్ హాస్పిటల్‌లో పని చేస్తున్న డాక్టర్ జితేంద్ర శర్మ ఈ రిపోర్టుపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పెళ్లి బారాత్‌లో ఏర్పాటు చేసిన డీజే నుంచి విడుదలైన భారీ శబ్దాల కారణంగా రక్తం గడ్డకట్టి ఉంటుందని తెలిపారు. డీజే ద్వారా లేదా ఇతర దేని ద్వారానైనా భారీ స్థాయిలో మ్యూజిక్ ప్లే చేస్తే అది మన బాడీలో అసాధారణ ఫిజియలాజికల్ రియాక్షన్స్‌ను ప్రేరేపించవచ్చు
అని వివరించారు. శ్రుతి మించిన డెసిబిల్స్ సౌండ్ల ద్వారా మనిషికి ముప్పేనని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ భారీ శబ్దాల కారణంగా గుండె, మెదడు వంటి అంతర్గత అవయవాలు దెబ్బతినవచ్చునని వివరించారు.
వివాహ వేడుకలో విషాదం – డీజేలో కుప్పకూలిన యువకుడు
Advertisement
తాజా వార్తలు
Advertisement