కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ని ఎమిరేట్స్ లో భేటీ అయిన వెంటనే యూఏఈ వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ విషయాన్ని మలయాళంలో ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్వీట్‌తో పాటు దుబాయ్ ఎక్స్ పో 2020 వేదికపై విజయన్‌కు ఇచ్చిన ఆతిథ్యం ఫొటోను కూడా ఆయన షేర్ చేశారు. కాగా, ఈ ట్వీట్‌ను సీఎం విజయన్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో రీ ట్వీట్చేయడం కనిపించింది.
“యుఏఈ కేరళతో ప్రత్యేక బంధాన్ని కలిగి ఉంది. దుబాయ్, యూఏఈల ఆర్థిక, అభివృద్ధిలో కేరళీయులు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారు” అని దుబాయ్ ప్రధాని మలయాళంలో రాశారు. అంతే ఆసక్తిని రేకెత్తించేలా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా షేక్ మొహమ్మద్ బిన్ రషీద్‌కు అరబిక్ లో ట్వీట్ చేసి థ్యాంక్స్ చెప్పడం మరింత సంచలనంగా మారింది. నిన్న జరిగిన వారి సమావేశంలో కేరళ అభివృద్ధిలో తమకు ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి విజయన్‌కు యూఏఈ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.