రూ.10 కోట్ల విలువైన 1081 గ్రాముల హెరాయిన్‌ను సీజ్ చేసిన ఢిల్లీ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నైజీరియాకు చెందిన డ్రగ్స్ సరఫరాదారు ఒలైటన్ అడెగోకె (50) గత ఏడాది డిసెంబర్ 10న భారత్‌కు మెడికల్ వీసాపై వచ్చాడు. నిందితుడి వీసా గడువు ఫిబ్రవరి 23తో ముగిసింది. ఏప్రిల్ 4న ఆఫ్రికన్ జాతీయుడు ఉత్తంనగర్ ప్రాంతంలో డ్రగ్స్ సరఫరా సాగిస్తున్నట్టు సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద ఉన్న తెలుపురంగు పాలిధీన్ బ్యాగ్‌లో 1081 గ్రాముల హెరాయిన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఉత్తం నగర్‌లో నివసించే మరో నైజీరియన్ నుంచి హెరాయిన్‌ను తాను కొనుగోలు చేశానని దర్యాప్తులో నిందితుడు వెల్లడించాడు. ఏఎస్ఐ కర్తార్, హెడ్‌కానిస్టేబుల్ దినేష్, జితేంద్ర సింగ్, కానిస్టేబుల్ రవి, కుల్దీప్, ప్రవీణ్, ఎస్ఐ సుభాష్ చంద్‌లు ప్రత్యేక బృందంగా ఏర్పడి నిందితుడిని పట్టుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement