బాంబే డ్రగ్స్ కేసులో షారుఖ్ తనయుడు ఆర్యన్ నేరం చేసినట్టు సాక్ష్యాలు లేవని బాంబే హైకోర్టు పేర్కొంది. ఈ క్రమంలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టు. క్రూయిజ్ షిప్ డ్రగ్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ అక్టోబర్-28న బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఇవాళ (20-11021) విడుదల చేసింది. 14 పేజీల ఉత్తర్వులో.. ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరు సహ నిందితులున్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కింద నేరానికి పాల్పడ్డారనడానికి సంబంధించి ఎలాంటి ప్రాథమిక సాక్ష్యం లేదని జస్టిస్ నితిన్ సాంబ్రే పేర్కొన్నారు.
ఈ ఇష్యూపై ప్రతివాది రికార్డు చేసిన మెటీరియల్‌కు సంబంధించి.. ఈ కోర్టు దరఖాస్తుదారులకు వ్యతిరేకంగా ఎటువంటి సానుకూల సాక్ష్యాలను గుర్తించలేదు అని ఆ ఉత్తర్వులో కోర్టు పేర్కొంది. నిందితులు క్రూయిజ్‌లో ప్రయాణిస్తున్నందున, నిందితులపై సెక్షన్ 29 నేరాన్ని ప్రయోగించడానికి కారణం కాకూడదని కోర్టు పేర్కొంది. దరఖాస్తుదారులపై కుట్ర కేసును రుజువు చేయడానికి సాక్ష్యాధారాల రూపంలో ప్రాథమిక అంశాలు ఉండాలనే వాస్తవాన్ని ఈ కోర్టు సున్నితంగా తెలుసుకోవాల్సిన అవసరముందని న్యాయమూర్తి ఆ తీర్పులో పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..