హైదరాబాద్‌ను డ్రగ్స్ అడ్డాగా మార్చే ఎత్తుగడలు కొనసాగుతున్నాయి. ఇక్కడి అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నా దొంగచాటుగా కొంతమంది తరలించి కోట్లలో డబ్బు కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నారు. అంతేకాకుండా విశ్వనగరం హైదరాబాద్ పేరును దెబ్బతీయాలన్న కుట్ర కూడా ఇందులో ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఇవ్వాల శంషాబాద్ విమానాశ్రయంలో జరిపిన తనిఖీల్లో డ్రగ్స్ క్యాప్సుల్స్ లభించాయి..
టాంజానియా నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ యువకుడి దగ్గర డీఆర్ఐ అధికారులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వరుసగా ఇవ్వాల ఇది రెండో ఘటన.. నిన్న కూడా 21.9 కోట్ల విలువైన హెరాయిన్ పట్టుపడగా.. ఇవ్వాల (మంగళవారం) 12 కోట్ల విలువైన డ్రగ్ క్యాప్యుల్స్ పట్టుకున్నారు డైరెక్టరేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు.