Saturday, November 23, 2024

డ్ర‌గ్స్ మాఫియా ముఠాల మ‌ధ్య కాల్పులు – ఎనిమిది మంది మృతి

షిలానో మెక్సికో సెంట్ర‌ల్ ప్రాంతంలో కాల్పుల క‌ల‌క‌లం రేగింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు చిన్నారులు స‌హా ఎనిమిది మంది మృతి చెందారు. ఈ కాల్పులు డ్ర‌గ్స్ మాఫియా ముఠాల మ‌ధ్య చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. గ్వానాజువాటో రాష్ట్రంలోని సిలావో మున్సిపాలిటీలో ఇద్ద‌రు దుండ‌గులు వ‌చ్చి ప‌లు ఇళ్ళ‌పై కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో ఏడాది చిన్నారితోపాటు 16ఏళ్ల బాలిక కూడా మ‌ర‌ణించింది.శాంటా రోసా డిలిమా, టాలిస్కో న్యూ జనరేషన్ కార్డెల్స్ మధ్య అధిపత్య పోరు కారణంగా గ్వానాజువా అత్యంత హింసాత్మక రాష్ట్రాల్లో ఒకటిగా మారింది. డ్రగ్స్ రవాణాతో పాటు మార్కెట్ పై ఆధిపత్యం సాధించేందుకు ఈ ముఠాల మధ్య పోరు నెలకొంది.ఈ ఏడాది నవంబర్ మాసంలో సిలావో ఇదే తరహలో రెండు దాడులు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనల్లో 11 మంది మరణించారు. 2006 నుండి మెక్సికోలో సుమారు 3 లక్షలకు పైగా హత్యలు చోటు చేసుకొన్నాయని మెక్సికో అధికారుల గణాంకాలు తెలిపాయి.. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో మెక్సికోలో 25 వేల కంటే ఎక్కువ హత్యలు జరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement