సినలోవా రాష్ట్రంలో భారీ స్థాయిలో అల్లర్లు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో ముగ్గురు సెక్యూర్టీ దళ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు.మెక్సికో డ్రగ్ మాఫియా లీడర్ ఎల్ చాపో కుమారుడు గుజ్మెన్ లోపేజ్ ను అరెస్టు చేయడంతో ఆ గ్యాంగ్ సభ్యులు బీభత్సం సృష్టించారు. రోడ్లను బ్లాక్ చేశారు. వాహనాలకు నిప్పు అంటించారు. స్థానిక ఎయిర్‌పోర్ట్‌పై కూడా దాడి చేశారు. రెండు విమానాలపై గన్‌ఫైర్ చేశారు. టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ఆ ముఠా ఫైరింగ్‌కు పాల్పడింది. సినలోవా విమానాశ్రయంలో వంద విమానాలను రద్దు చేశారు. 18 మందిని హాస్పిటల్‌లో చేర్పించినట్లు రాష్ట్ర గవర్నర్ తెలిపారు. ద మౌజ్ పేరుతో లోపేజ్ డ్రగ్ కార్టల్‌ను నడిపిస్తున్నాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆ గ్యాంగ్ డ్రగ్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతోంది. లోపేజ్ తండ్రి ఎల్ చాపో అమెరికాలో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement